‘ఇండియన్ 2’.! శంకర్ స్టైల్ ప్రమోషన్స్ షురూ.!
- April 30, 2024
దర్శకుల యందు శంకర్ దర్శకత్వం వేరయా అనొచ్చు. ఆయన తెరకెక్కించే సినిమాల్లో సోషల్ మెసేజ్‌తో పాటూ, విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తుంటాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఇండియన్ 2’ సినిమా సంచలనాత్మక విజయం కోసం ఎదురు చూస్తోంది.
దేశం మొత్తం ఈ సినిమా వీక్షించేందుకు ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. కమల్ హాసన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్, సంచలన విజయం అందుకున్న సినిమా ‘ఇండియన్’కి సీక్వెల్‌గా రాబోతున్న చిత్రమిది. షూటింగ్ టైమ్‌లో ఈ సినిమా ఫేస్ చేసిన కష్టాలు మరే సినిమా ఫేస్ చేసి వుండదేమో.
టెక్నీషియన్ ఒకరి మరణానికి కారణమైంది కూడా ఈ సినిమా. అన్ని అడ్డంకుల్నీ ఎదుర్కొని ముందుకెళ్లి ఎట్టకేలకు ఈ సినిమా పూర్తి చేశారు కమల్ అండ్ శంకర్. ఇక సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. జూన్‌లో సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా వుంది.
మే నుంచి సినిమా ప్రమోషన్లు చేయనున్నారట. అందులో భాగంగానే ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఘనంగా చేయాలని అనుకుంటున్నారట. ఈ ఈవెంట్‌కి సూపర్ స్టార్ రజనీకాంత్, మెగా పవర్ స్టార్ అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారన్నది ఓ గాసిప్.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







