టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- April 30, 2024
ముంబై: వెస్టిండీస్ మరియు యూఎస్ఏలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది ఆటగాళ్ళతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టులో శివమ్ దూబే మరియు యుజ్వేంద్ర చాహల్‌లు ఎంపిక అయ్యారు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా మరియు హార్దిక్ పాండ్య డెప్యూటీగా ఉంటారు. బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్ ఉన్నారు. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్ మరియు సంజు శాంసన్ ఉన్నారు. కారు ప్రమాదం తర్వాత ఐపీఎల్లో తిరిగి వచ్చాన రిషబ్ పంత్ , 9 మ్యాచులలో 158 స్ట్రైక్ రేట్‌తో 350+ పరుగులు చేసి మంచి ఫార్మ్ కనబరిచాడు. సంజు శాంసన్ కూడా మంచి ఫార్మ్ లో ఉన్నారు. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మరియు యుజ్వేంద్ర చాహల్ ను ఎంపిక అయ్యారు. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ మరియు అర్షదీప్ సింగ్ ఎంపిక అయ్యారు. ఐపీఎల్లో శివమ్ దూబే తన ప్రదర్శనతో రింకూ స్థానాన్ని ఆక్రమించాడు. జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (ఉపకెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. రిజర్వు ప్లేయర్లు: శుబ్మాన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు