రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- May 01, 2024
మస్కట్: రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంగళవారం మొదటి లాజిస్టిక్స్ డేని ఘనంగా జరుపుకుంది. ఈ వేడుక లాజిస్టిక్స్ రంగంలో 2024లో అమలు చేయబోయే 6 కార్యక్రమాలను ప్రకటించారు. రెండు సంవత్సరాల పాటు మస్కట్ మరియు సలాలా నగరాలలో ప్రజా రవాణా నెట్వర్క్ ద్వారా కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నారు. అదే విధంగా లాజిస్టిక్స్ రంగంలో చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (SMEలు) సాధికారత కల్పించడానికి ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. ఈ కార్యక్రమంలో లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మూడవ దశ వర్క్‌షాప్‌లు, క్లినిక్‌లను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా "లాజిస్టిక్స్ సెక్టార్లో బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు" విజేతలను ప్రకటించారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







