ఈ వారం చిన్న సినిమాల జాతర.! గెలుపెవరిదో.!

- May 01, 2024 , by Maagulf
ఈ వారం చిన్న సినిమాల జాతర.! గెలుపెవరిదో.!

ఈ వారం మూడు విభిన్న తరహా సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు పోటీ పడుతున్నాయ్. అందులో సీనియర్ హీరో అల్లరి నరేష్ కూడా వున్నాడు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సినిమాతో లాంగ్ బ్యాక్ తర్వాత తనదైన వినోదంతో ఆకట్టుకోబోతున్నాడు అల్లరి నరేష్.

అలాగే ఈ మధ్య కంటెంట్ వున్న సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ తనదైన హీరోయిజంతో దూసుకెళ్లిపోతున్న యంగ్‌స్టర్ సుహాస్ ‘ప్రసన్నవదనం’ సినిమాతో వస్తున్నాడు. సుహాస్ ప్రధాన పాత్రలో సినిమా అంటే అది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ కంటెంటే.. అనే ముద్ర పడింది. సో, ఈ సినిమా పైనా అంచనాలు బాగానే వున్నాయ్.

ఇక ముచ్చటగా మూడో సినిమా ‘బాక్’. తమన్నా ప్రధాన పాత్రలో హారర్ బేస్ కంటెంట్‌తో ఈ సినిమా రూపొందింది. తమిళ ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా దెయ్యం పాత్రలో నటిస్తుండగా, రాశీఖన్నా మరో కీలకమైన పాత్ర పోషిస్తోంది.

మరి మూడు డిఫరెంట్ సబ్జెక్టుల్లో ఈ వారం బాక్సాఫీస్ వద్ద గెలుపు ఎవరిదో లెట్స్ వెయిట్ అండ్ సీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com