ప్రశాంత్ నీల్-తారక్ మెదలెట్టేదెప్పుడంటే.!

- May 01, 2024 , by Maagulf
ప్రశాంత్ నీల్-తారక్ మెదలెట్టేదెప్పుడంటే.!

‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో జూనియర్ ఎన్టీయార్ ఓ సినిమా చేయాల్సిన సంగతి తెలిసిందే. అయితే, ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘సలార్ 2’ సినిమా పనుల్లో బిజీగా వున్నారు. రేపో మాపో ఈ సినిమాని పట్టాలెక్కించాలి. ఈ సినిమా తర్వాతే ఎన్టీయార్ సినిమాపై దృష్టి పెట్టనున్నారన్న టాక్ వినిపించింది.

అయితే, ప్రబాస్ లిస్టులో ‘సలార్ 2’తో పాటూ ‘స్పిరిట్’, ‘రాజా సాబ్’, హను రాఘవపూడితో చేయాల్సిన సినిమా ఒకటి.. ఇలా చాలానే ప్రాజెక్టులున్నాయ్.

అలాగే ఎన్టీయార్ చేతిలో ‘దేవర 1’, ‘దేవర 2’, బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ సినిమాలున్నాయ్. ఇవి పూర్తయ్యాకే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే అవకాశాలున్నాయ్.

కానీ, తాజాగా అందుతోన్న ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌ని మొదలెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్, లేదా నవంబర్ నెలల్లో ఈ సినిమాని మొదలెట్టే ప్రయత్నాలు ఓ కొలిక్కి రానున్నాయని తెలుస్తోంది. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com