‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ షురూ చేసిన మెగా పవర్ స్టార్.!
- May 01, 2024
మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా మళ్లీ షూటింగ్ షురూ కానుంది. డైరెక్టర్ శంకర్ ఈ మధ్య ‘ఇండియన్ 2’ సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా వుండడం వల్ల ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్‌కి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాడు.
ప్రస్తుతం ‘ఇండియన్ 2’ షూటింగ్ పనులు పూర్తయ్యాయ్. ప్రమోషన్లు షురూ చేసింది. దాంతో, ‘గేమ్ ఛేంజర్’పై శంకర్ ఫోకస్ పెట్టారట. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరగనుందట.
రామ్ చరణ్‌తో పాటూ, సినిమాలోని కీలక పాత్రలు ఈ షూటింగ్ షెడ్యూల్లో పాల్గొనబోతున్నారట. రెండు రోజులు చెన్నైలో కీలక సన్నివేశాల చిత్రీకరణ అనంతరం మళ్లీ ప్రత్యేకంగా సిద్దం చేసిన సెట్స్‌లో మరి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట.
అందుకోసం ఆల్రెడీ రామ్ చరణ్ చెన్నైకి పయనమయ్యారు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్గా రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ‘జరగండి.. జరగండి..’ సాంగ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







