విసా, క్రెడిమ్యాక్స్, లులు గ్రూప్ మధ్య ఒప్పందం
- June 08, 2016విసా ఐఎన్సి, క్రెడిమ్యాక్స్ మరియు లులు గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కారణంగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు, ప్రత్యేకమైన బెనిఫిట్స్ మరియు ఆఫర్స్ అందుతాయని ఆయా సంస్థల ప్రతినిథులు వివరించారు. పవిత్ర రమదాన్ మాసంలో వినియోగదారులకు మెరుగైన సేవల్ని, ఆకర్షణీయమైన ఆఫర్లను అందివ్వగలమని వారు చెప్పారు. లులు గ్రూప్ ఔట్‌లెట్స్‌లో, విసా కార్డ్ దారులకు ప్రత్యేక రివార్డులు, అలాగే ప్రత్యేకమైన బహుమతులు రమదాన్ మాసం అంతటా ఇవ్వనున్నారు. 10 బహ్రెయినీ దినార్ల కన్నా ఎక్కువ ఖర్చు చేసే వీసా కార్డుదారులు, వీక్లీ డ్రాలో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారు. టెలివిజన్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లను బహుమతులుగా అందించనునన్నారు నిర్వాహకులు. కన్స్యూమర్ స్పెండింగ్ విభాగంలో మిడిల్ ఈస్ట్‌కి సంబంధించినంతవరకు బహ్రెయిన్ ఆహ్వానించదగ్గ పురోగతని సాధిస్తోంది. 2009తో పోల్చితే 33 శాతం కన్స్యూమర్ స్పెండింగ్ పెరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. 10 బహ్రెయినీ దినార్లకన్నా ఎక్కువ ఖర్చు చేసేవారికి తక్షణ బహుమతులతోపాటు, వీక్లీ డ్రాలో పాల్గొనే అవకాశం ఉంటుందని క్రెడిమాక్స్ హెడ్ ఆఫ్ మర్చంట్ సర్వీసెస్ అండ్ సేల్స్ అమీరా ఇస్మాయిల్ చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..