శక్తివంతమైన మహిళల్లో ఇద్దరు యూఏఈ మహిళలు

- June 08, 2016 , by Maagulf
శక్తివంతమైన మహిళల్లో ఇద్దరు యూఏఈ మహిళలు

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల కేటగిరీలో యూఏఈకి చెందిన ఇద్దరు మహిళలకు స్థానం దక్కింది. ఇంటర్నేషనల్‌ మాగజైన్‌ ఫోర్బ్స్‌ ఈ వివరాల్ని వెల్లడించింది. యూఏఈ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ టోలరెన్స్‌ షేకా లుబ్నా అల్‌ ఖాసిమి ఈ కేటగిరీలో 43వ స్థానాన్ని సంపాదించుకున్నారు. కాలిఫోర్నియా స్టేట్‌ చికో నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ / సైన్స్‌ పట్టా పొందిన ఈమె, అమెరికన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ షార్జా నుంచి ఇఎంబిఎ పట్టా పొందారు. ఇసా సలే అల్‌ గుర్గ్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రజా ఇసా అల్‌ గుర్గ్‌ ఈ గౌరవం దక్కించుకున్న రెండో మహిళ. ఆమెకు 91వ స్థానం దక్కింది. 2015లో ఈమెకు మిడిల్‌ ఈస్ట్‌ విభాగంలో రెండవ ర్యాంక్‌ లభించింది. కామర్స్‌ మీటింగ్స్‌కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో తనదైన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు రజా ఇసా అల్‌ ఈమె కువైట్‌ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ / సైన్స్‌ పట్టా పొందారు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. 2015లో ఆమెకు 97వ ర్యాంక్‌ దక్కింది. ఇసా సలె అల్‌ గుర్గ్‌ గ్రూప్‌లో 24 కంపెనీలున్నాయి, 370 అంతర్జాతీయ బ్రాండ్‌ పార్టనర్‌షిప్‌లు ఈ సంస్థ సొంతం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com