విసా, క్రెడిమ్యాక్స్, లులు గ్రూప్ మధ్య ఒప్పందం
- June 08, 2016
విసా ఐఎన్‌సి, క్రెడిమ్యాక్స్ మరియు లులు గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కారణంగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు, ప్రత్యేకమైన బెనిఫిట్స్ మరియు ఆఫర్స్ అందుతాయని ఆయా సంస్థల ప్రతినిథులు వివరించారు. పవిత్ర రమదాన్ మాసంలో వినియోగదారులకు మెరుగైన సేవల్ని, ఆకర్షణీయమైన ఆఫర్లను అందివ్వగలమని వారు చెప్పారు. లులు గ్రూప్ ఔట్‌లెట్స్‌లో, విసా కార్డ్ దారులకు ప్రత్యేక రివార్డులు, అలాగే ప్రత్యేకమైన బహుమతులు రమదాన్ మాసం అంతటా ఇవ్వనున్నారు. 10 బహ్రెయినీ దినార్ల కన్నా ఎక్కువ ఖర్చు చేసే వీసా కార్డుదారులు, వీక్లీ డ్రాలో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారు. టెలివిజన్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లను బహుమతులుగా అందించనునన్నారు నిర్వాహకులు. కన్స్యూమర్ స్పెండింగ్ విభాగంలో మిడిల్ ఈస్ట్‌కి సంబంధించినంతవరకు బహ్రెయిన్ ఆహ్వానించదగ్గ పురోగతని సాధిస్తోంది. 2009తో పోల్చితే 33 శాతం కన్స్యూమర్ స్పెండింగ్ పెరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. 10 బహ్రెయినీ దినార్లకన్నా ఎక్కువ ఖర్చు చేసేవారికి తక్షణ బహుమతులతోపాటు, వీక్లీ డ్రాలో పాల్గొనే అవకాశం ఉంటుందని క్రెడిమాక్స్ హెడ్ ఆఫ్ మర్చంట్ సర్వీసెస్ అండ్ సేల్స్ అమీరా ఇస్మాయిల్ చెప్పారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







