దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ

- May 03, 2024 , by Maagulf
దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ

దుబాయ్: దుబాయ్‌లో కలరా కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 16న రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం కారణంగా ఎమిరెట్స్ లోని కొన్ని ప్రాంతాలు వరదలకు గురయ్యాయని, ఆనంతరం  అక్యూట్ డయేరియా ఇన్ఫెక్షన్ గురించిన ఆందోళనలను ప్రస్తావిస్తూ, దుబాయ్‌లో ఎటువంటి కేసులు లేవని అధికారులు తెలిపారు. "కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ఛానెల్‌లపై ఆధారపడాలని మేము ప్రజలకు సలహా ఇస్తున్నాము.  అన్ని సీజన్‌లు మరియు వాతావరణ పరిస్థితులలో నివారణ చర్యలను సిఫార్సు చేస్తున్నాము" అని దుబాయ్ మీడియా ఆఫీస్ ఒక ప్రకటనలో పేర్కొంది. దుబాయ్‌లో వర్షాల కారణంగా నీరు కలుషితమైందన్న పుకార్లను అధికారులు ఖండించారు.  ముందుజాగ్రత్తగా, పేరుకుపోయిన వర్షపు నీరు మరియు నిలిచిపోయిన నీటిని తీసి వేయాలని ప్రజలకు సలహా జారీ చేశారు. విరేచనాలు మరియు వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే  వైద్య సహాయం పొందాలని దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) సూచించింది.ఇంటి చుట్టూ ఉన్న గ్రౌండ్ మురుగు కాలువలు మరియు నీటి పారుదల నెట్‌వర్క్‌లు బ్లాక్ అయితే, నివాసితులు వెంటనే 800900లో దుబాయ్ మునిసిపాలిటీ  కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com