'దో లఫ్జోంకీ కహానీ'తో కాజల్ అగర్వాల్
- June 08, 2016
దక్షిణాదిన తెలుగు.. తమిళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి కాజల్ అగర్వాల్. హిందీలో మాత్రం అంతగా రాణించలేకపోతుంది. 2011లో 'సింగం' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ కేవలం రెండు సినిమాల్లోనే నటించింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రస్తుతం రణ్‌దీప్ హుడా సరసన 'దో లఫ్జోంకీ కహానీ'తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇదే విషయాన్ని కాజల్ వద్ద ప్రస్తావించగా.. 'అన్ని భాషల్లో ఒకేసారి నటించడానికి నేనేం సర్వాంతర్యామిని కాదు' అంటోంది కాజల్ అగర్వాల్. .' నేను తెలుగు..తమిళం.. హిందీ చిత్రాల్లో నటిస్తున్నా. వాటన్నింటినీ సమన్వయం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఈ మూడు భాషల్లో ఒకేసారి నటించడం చాలా కష్టమైన పని. అందుకే ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ నిదానంగా నటిస్తున్నాను. అందుకే ఈ గ్యాప్ వచ్చింది. అన్ని భాషల్లో ఒకేసారి నటించడానికి నేనేం సర్వాంతర్యామిని కాదు. అదృష్టం కొద్దీ అన్ని భాషల్లోనూ మంచి అవకాశాలుదక్కుతున్నాయి.' అని చెప్పుకొచ్చింది.'ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాలు చేశా. మూడో సినిమా విడుదలకు సిద్ధమైంది. మరో కొన్ని కథలను వింటున్నా. వాటిల్లో కొన్నింటిలో నటించబోతున్నా. దాని గురించి ఇప్పుడు నేనేం మాట్లాడను. వాటి గురించి చిత్ర బృందాలు త్వరలో ప్రకటిస్తాయని ఎదురు చూస్తున్నా' అంటోంది కాజల్.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







