'కత్తిలాంటోడు' షూటింగ్ కౌంట్ డౌన్ ప్రారంభం ..
- June 08, 2016
మెగా స్టార్ చిరంజీవి దర్శకుడు వినాయక్ కలకత్తా జైలుకు సంబంధించి ఇచ్చిన సూచనలను తిరస్కరించి నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి 150వ సినిమా 'కత్తిలాంటోడు' షూటింగ్ ప్రారంభానికి కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో ఈనెల 15వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్న ఈసినిమాలోని జైల్ సీన్ ను కలకత్తా జైలులోనే షూట్ చేద్దామని వినాయక్ భావించాడు అని టాక్.
దీనికి కారణం విజయ్ నటించిన 'కత్తి' సినిమాలో విజయ్ ఇంట్రడక్షన్ సీన్ కలకత్తా జైలులో తీసారు. ఆ జైలు నుంచి విజయ్ పారిపోయే సీన్స్ అన్ని సహజత్వo కోసం ఇలా జైలులో తీసారు. అయితే ఈ సూచనను చిరంజీవి తిరస్కరించడంతో ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి డిజైనింగ్ లో రామోజీ ఫిలింసిటీలో ఒక జైలు సెట్ వేసి చిరంజీవి జైలు నుంచి పారిపోయే సీన్ చిత్రీకరించబోన్నారు.
దాదాపు 9 ఏళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ భారీ యాక్షన్ సీన్ లో చిరంజీవి నటిస్తూ ఉండటంతో వినాయక్ ఈ సన్నివేశానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ యాక్షన్ సీన్ తో మొదలు పెట్టి చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలని చిరంజీవి వినాయక్ లు గట్టి పట్టుదల పై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్ గా 1 బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనే నటించడానికి అంగీకరించినా ఆమె పారితోషికంగా 5 కోట్లు పైగా డిమాండ్ చేస్తూ ఉండటంతో ప్రస్తుతం ఆమెతో . చర్చలు జరుగుతున్నట్లు టాక్..
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







