ఆమెకు వయసు తగ్గిపోతే బాగుండుగా.!

- May 04, 2024 , by Maagulf
ఆమెకు వయసు తగ్గిపోతే బాగుండుగా.!

ఒకప్పుడు కుర్రాళ్లందరికీ క్రష్ ఆమె అందం. ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఆమె కెరీర్ సొంతం. అలాంటిది క్యాన్సర్ బారిన పడి తనువు చాలిస్తుందనుకున్న సమయంలో గుండె ధైర్యంతో ఆ మహమ్మారిని జయించింది. ఆమె ఎవరో కాదు, సీనియర్ హీరోయిన్ మనీషా కోయిరాల.

క్యాన్సర్‌ని జయించాకా ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచింది. క్యాన్సర్‌పై ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది చేపడుతూనే వుంది. ఈ మధ్యనే సినిమాల్లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది మనీషా కోయిరాల.

సినిమాలతో పాటూ, తాజాగా ఆమె నటించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్ అద్భుతస్య, అధ్భుతహ అనాలేమో. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ పోషించిన మనీషా కోయిరాల కొన్ని సన్నివేశాల్లో ఆమె నటనకు పాదాక్రాంతులైపోయారు ఓటీటీ జనం.

కొన్ని సన్నివేశాల్లో అయితే అయ్యో.! మనీషా కోయిరాలకి వయసైపోయిందే.. ఆమె వయసు మళ్లీ తగ్గిపోతే బాగుండనిపించింది. అంతలా ఓ వేశ్య పాత్రలో అనేక రకాలైన వేరియేషన్స్ ప్రదర్శించి ఆకట్టుకుంది. తెలుగులో కూడా ఈ వెబ్ సిరీస్ అందుబాటులో వుండడంతో తెలుగు ఆడియన్స్‌కీ బాగా కనెక్ట్ అవుతోంది. గట్టిగా చెప్పాలంటే ఈ సిరీస్‌లోని ప్రతీ పాత్ర అద్భుతమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com