ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- May 05, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఈ ఆదేశాలు ఈ క్షణం నుంచే వర్తిస్తాయని పేర్కొంది. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని ఆదేశించింది. కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలంటూ సూచనలు చేసింది.
డీజీ ర్యాంకు ఉన్న ముగ్గురు అధికారుల లిస్టును సోమవారం ఉదయం 11 గంటలలోగా పంపాలని చెప్పింది. రాజేంద్రనాథ్ రెడ్డిపై విపక్షాలు చేసిన ఫిర్యాదుల మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల విషయంలో వైఫల్యాలు ఉన్నప్పటికీ, నేతలపై దాడులు జరుగుతున్నప్పటికీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పట్టించుకోవటం లేదని విపక్షాలు ఆరోపించాయి. ఇటీవలే.. డీజీపీని బదిలీ చేయాలంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేశారు.
అంతకుముందు కూడా రాజేంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ ఫిర్యాదు చేసింది. ఆయనను విధుల నుంచి తప్పించాలని తాము ఈసీకి ఫిర్యాదు చేసినట్లు రెండు వారాల క్రితం టీడీపీ నేత వర్ల రామయ్య చెప్పారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా