శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- May 06, 2024
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్‌లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. శబరిమలకు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారిక వెబ్సైట్లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రోజుకు వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా అయ్యప్ప దర్శనానికి 80వేల మందిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.
మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. గతంలో ఆన్లైన్ బుకింగ్ సదుపాయం 10 రోజుల ముందు వరకు మాత్రమే ఉండగా.. ఇప్పుడు దానిని మూడు నెలల ముందు వరకు ట్రావెన్కోర్ దేవస్థానం పెంచినట్లు ప్రకటించింది. మరోవైపు, తిరువాభరణం ఊరేగింపు, మకరవిళక్కు టైంలో ఆన్లైన్ బుకింగ్‌ను అనుమతించాలా? వద్దా? అనే విషయమై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా