‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.! రాధికతో మాస్ కా దాస్ ఘాటు రొమాన్స్ నెక్స్‌ట్ లెవల్.!

- May 07, 2024 , by Maagulf
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.! రాధికతో మాస్ కా దాస్ ఘాటు రొమాన్స్ నెక్స్‌ట్ లెవల్.!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావల్సి వుంది. కానీ, వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ‘గామి’ కన్నా ముందే ఈ సినిమాతో ప్రేక్షకులకి హాయ్ చెప్పాల్సి వుంది విశ్వక్ సేన్.

కానీ, కుదరలేదు. ఎట్టకేలకు మే 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని లేటెస్ట్‌గా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఈ సినిమాలో ‘డీజె టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో, హీరోయిన్ల గాఢమైన రొమాంటిక్ లిప్‌లాక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక, లేటెస్ట్ పోస్టర్‌తో సినిమాపై మంచి కమర్షియల్ అంచనాలు కూడా ఏర్పడ్డాయ్. అసలే సమ్మర్ ఈ ఏఢాది సినీ ప్రియులకి కాస్త డల్‌గానే తోస్తోంది. ఈ టైమ్‌లో విశ్వక్‌సేన్ వంటి యూత్ స్టార్ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. దుమ్ము దులిపేయడం పక్కా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com