ఓటీటీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయిన ‘మంజుమ్మల్ బాయ్స్’.!

- May 07, 2024 , by Maagulf
ఓటీటీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయిన ‘మంజుమ్మల్ బాయ్స్’.!

ఈ మధ్యనే ధియేటర్లలో రిలీజ్ అయిన ఈ మలయాళ డబ్బింగ్ చిత్రాన్ని రిలీజ్‌కి ముందు తెలుగులోనూ బాగా ప్రమోట్ చేశారు. అయితే, ధియేటర్లలో అంతంత మాత్రమే ఆకట్టుకున్పప్పటికీ, రీసెంట్‌గా ఓటీటీలోకొచ్చిన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్‌ని కట్టి పడేస్తోంది.

మంజుమ్మల్ అనే ఊరికి చెందిన పది మంది స్నేహితుల సరదా ట్రిప్ నేపథ్యం చుట్టూ సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరినీ కదిలించింది. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ధియేటర్లలోనూ ఈ సినిమా బాగానే వసూళ్లు కొల్లగొట్టిందని అంటున్నారు.

టెక్నికల్‌గా రిచ్‌గా అంతే నేచురల్‌గా రూపొందిన ఈ చిత్రానికి బడ్జెట్ చాలా తక్కువే. కానీ, వసూళ్లు మాత్రం ఊహించని విధంగా వచ్చాయట. తమిళనాడులో ఈ సినిమాకి బ్యాన్ విధించినా మిగిలిన చోట్ల మంచి వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఇక, ఓటీటీ ఆడియన్స్ అయితే, ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆసక్తికరమైన కథనంతో అంతులేని ఎమోషన్‌తో కట్టి పడేసిన ఈ చిత్రం నిజంగానే ఓ అద్భుత దృశ్య కావ్యంగా అభివర్ణించొచ్చేమో. ఎటువంటి గ్లామర్ లేదు. కమర్షియల్ అంశాలు అసలే లేవు. కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే. అది కూడా ఎమోషన్‌తో కట్టిపడేసేలా.! ఓటీటీలో అందుబాటులో వుంది కనుక, ఒక్కసారైనా ఈ చిత్రం చూసి తీరాల్సిందే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com