యూఏఈ వాసులకు రమదాన్‌లో ఫ్రీ రైడ్
- June 08, 2016
రమదాన్ సందర్భంగా గ్రాసరీ షాపింగ్ లేదా ఇఫ్తార్‌కి వెళ్ళేందుకు, వచ్చేందుకు ట్యాక్సీ దొరకక ఇబ్బంది పడేవారికి శుభవార్త. ఎమిరేట్స్ ఎన్‌బిడి, ఉబర్ క్యాబ్స్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకుని, తమ వినియోగదారులకు ఉచిత రైడ్ అందిస్తోంది. తమ డెబిట్ కార్డ్ ఉన్నవారు, ఉబర్ క్యాబ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, దాని ద్వారా రిజిస్టర్ చేసుకుంటే వారికి ఉచితంగా రైడ్ అందిస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు, గురువారం నుండి శనివారం వరకు రమదాన్ సందర్భంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఓ వ్యక్తికి గరిష్టంగా ఎనిమిది ట్రిప్పులు అలాగే, మేగ్జిమమ్ లిమిట్ 40 దిర్హామ్‌లకు మాత్రమే అనుమతివ్వబడుతుంది. ఉబెర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసకుని ఎమిరేట్స్ ఎన్‌బిడి కార్డ్‌ని పేమెంట్ మెథడ్ కోసం వినియోగించాలి. ప్రోమో కోడ్‌ని ప్రవేశపెట్టి, ఇఎన్‌బిడి ఆప్షన్‌ని యాక్సెస్ చెయ్యాలి. ఇన్‌బిడిని స్లైడ్ చేసి, 6 నుంచి 9 గంటల లోపు రైడ్‌ని సెలెక్ట్ చెయ్యాలి.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







