సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- May 10, 2024
రియాద్: మూడు సెమిస్టర్ల విధానంపై సౌదీ విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన అధ్యయనం పూర్తయిన తర్వాత ఫలితాలను ప్రకటిస్తామని సౌదీ విద్యా మంత్రి యూసఫ్ అల్-బెన్యాన్ తెలిపారు. బుధవారం రియాద్‌లో స్పీకర్ షేక్ అబ్దుల్లా అల్-షేక్ అధ్యక్షతన జరిగిన శౌరా కౌన్సిల్ సెషన్లో ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ కమిటీ హెడ్ డాక్టర్ ఐషా జక్రి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. "విద్యా మంత్రిత్వ శాఖ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సంబంధిత అధికారుల భాగస్వామ్యంతో శాస్త్రీయ మరియు విద్యా పునాదుల ప్రకారం మూడు-సెమిస్టర్ అనుభవాన్ని తెలుసుకోవడానికి కృషి చేస్తోంది. ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ అధ్యయనం ఫలితాన్ని ప్రకటిస్తుంది" అని ఆయన చెప్పారు. మూడు సెమిస్టర్లతో కూడిన సానుకూల ప్రభావం, సవాళ్ల గురించి అధ్యయనం చేయడానికి ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు శౌరా కౌన్సిల్లో చెప్పారు. మంత్రిత్వ శాఖ గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యా స్థాయిలో మూడు సెమిస్టర్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. మంత్రిత్వ శాఖ విద్యా సంవత్సరాన్ని మునుపటి రెండు సెమిస్టర్లకు బదులుగా మూడు సెమిస్టర్లుగా విభజించింది, ప్రతి సెమిస్టర్‌కు 13 వారాల సమయాన్ని కేటాయించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!