‘ఓ మంచి ఘోస్ట్’ టీజర్ రిలీజ్..
- May 11, 2024
హైదరాబాద్: ఇటీవల హారర్ కామెడీ సినిమాలు బాగానే వర్కౌట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరలో ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ అనే హారర్ కామెడీ సినిమా రాబోతుంది. వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని.. పలువురు ముఖ్య పాత్రల్లో శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ సినిమా నుంచి ఓ సాంగ్, కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ భయపెడుతూనే నవ్వించింది. ఈ సినిమాలో నందితా శ్వేతా ఘోస్ట్ గా నటించింది. టీజర్ లో.. పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది అనే ఆసక్తికర డైలాగ్‌తో మొదలుపెట్టారు. వెన్నెల కిషోర్, షకలక శంకర్ దయ్యలతో చేసే కామెడీ చూపించారు. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!