‘నింద’ ఫస్ట్ లుక్ రిలీజ్..
- May 11, 2024
హైదరాబాద్: హ్యాపీడేస్ సినిమాతో వరుణ్ సందేశ్ ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలతో విజయం సాధించి మంచి గుర్తింపు సాధించాడు. కానీ కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వడం, కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు వరుణ్ సందేశ్. కొన్నాళ్ల క్రితం బిగ్ బాస్ లో పాల్గొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు వరుణ్ సందేశ్. అప్పట్నుంచి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో నింద అనే ఓ కొత్త సినిమాతో రాబోతున్నాడు.
గతంలో నింద టైటిల్ అనౌన్స్ చేసిన ఈ మూవీ నేడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథం ఈ సినిమాని నిర్మిస్తూ దర్శకుడిగా కూడా తెరకెక్కిస్తున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ నింద సినిమా ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ చేసారు. ఈ టైటిల్ కి కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ ఇవ్వడం గమనార్హం. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో వరుణ్ సందేశ్ అమయాకంగా ఉంటే వెనుక ఓ ముసుగు వ్యక్తి రూపం ఉంది. అలాగే ఈ పోస్టర్‌ను రివర్స్ చేస్తే న్యాయదేవత విగ్రహం, ముసుగు వ్యక్తి రూపం ఉంది. దీంతో ఈ నింద సినిమా కోర్ట్ రూమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తుంది.
ఆల్రెడీ ఈ నింద మూవీ షూటింగ్ పూర్తిచేశారు. మే 15న ఈ సినిమా టిజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. వరుణ్ సరసన ఆనీ నటిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..