ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- May 11, 2024
హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు డ్యూటీలో టీషర్ట్స్, జీన్స్ వేసుకోవద్దని టీఎస్ ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్‌టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫామ్ ధరిస్తున్నారు. మిగతా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేకపోవడంతో క్యాజువల్స్‌లోనే కార్పొరేషన్, డిపోలకు విధులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి ఆర్‌టీసీ ఉద్యోగులందరూ డిగ్నిటీగా ఉండేందుకు ఫార్మల్స్, యూనిఫామ్‌లో రావాలని ఎండీ సజ్జనార్ సూచించారు.
కాగా, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ డ్రెస్ లో కనిపిస్తారు.. బస్టాప్, బస్టాండ్ లలో సూపర్ వైజర్లు తెల్లరంగు దుస్తుల్లో కనిపిస్తారు. డిపోలు, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో అధికారులు యూనిఫాం అంటూ ఏదీ లేదు. డ్రెస్ కోడ్ లేకపోవడంతో అందరూ జీన్స్, టీషర్ట్స్ దరిస్తున్నారు. కొంతమంది ఉన్నతాధికారులు ఈ తరహా వస్త్రధారణతో విధుల్లో కనిపిస్తున్నారు. దీన్ని ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. ఇటీవల ఆయన గుగుల్ సమావేశాలు నిర్వహించిన సమయాలో చాలా మంది జీన్స్, టీషర్టుల్లో కనిపించడం చాలా చికాకు తెప్పించిందని.. ఈ నేపథ్యంలోనే ఆయన సంస్థ గౌరవ ప్రదంగా ఉండే ఫార్మల్ డ్రెస్సుల్లోనే అధికారులు విధుల్లో కనిపించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా అధికారుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!