యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- May 11, 2024
యూఏఈ: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ఇటీవల 2023కి సంబంధించి రోడ్డు భద్రత గణాంకాలపై 'ఓపెన్ డేటా'ను విడుదల చేసింది. ఏ రోడ్లు మరియు వీధుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయో అందులో వెల్లడించింది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ (E311), అబుదాబిలోని అల్ ఫలాహ్ నుండి రస్ అల్ ఖైమా (RAK) వరకు ఉన్న ప్రధాన రహదారిలో గత సంవత్సరం 266 మంది ప్రమాదాలకు గురయ్యారు. ఇందులో 223 మంది గాయపడగా, 43 మంది మరణించారు. రెండవ అత్యంత ప్రమాదకరమైన రహదారి ఎమిరేట్స్ రోడ్. దీనిపై 18 మరణాలుచోటు చేసుకోగా, 104 మంది గాయపడ్డారు.
దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్ లో 16 మరణాలు, 131 గాయపడ్డ సంఘటనలు జరిగాయి. ప్రమాదాల్లో ఇది మూడవ స్థానంలో ఉంది. నాల్గవ స్థానంలో అబుదాబి-అల్ ఐన్ రోడ్ 171 మందికి గాయాలు, 13 మరణాలు చోటుచేసుకున్నాయి. షేక్ మక్తూమ్ బిన్ రషీద్ రోడ్ 134 మందితో ఐదవ స్థానంలో నిలిచింది. ఇందులో 12మంది మరణించారు.
యూఏఈలో మిగిలిన ఐదు అత్యంత ప్రమాదకరమైన రోడ్లు:
ర్యాంక్- రోడ్డు- మరణాలు-గాయపడ్డవారి సంఖ్య
6. అబుదాబి-అల్ సిలా -11 -62
7. దుబాయ్-అల్ ఐన్ -10 -19
8. టారిఫ్ -7 -24
9. ఖోర్ ఫక్కన్ -7 -17
10. అల్ ఖైల్ -5 -154
డేటా ప్రకారం.. మరణాల జాబితాలో అబుదాబి అగ్రస్థానంలో ఉండగా, 2023లో అత్యధిక సంఖ్యలో గాయపడినవారిలో దుబాయ్ అగ్రస్థానంలో ఉంది.
రోడ్డు మరణాలు:
అబుదాబి 133
దుబాయ్ 121
షార్జా 34
రాస్ అల్ ఖైమా 30
ఉమ్ అల్ క్వైన్ 16
అజ్మాన్ 11
ఫుజైరా 7
ప్రమాదాల్లో గాయపడ్డవారు:
దుబాయ్ 2,607
అబుదాబి 1,850
షార్జా 387
రాస్ అల్ ఖైమా 326
ఫుజైరా 202
అజ్మాన్ 133
ఉమ్ అల్ క్వైన్ 63
2023లో దేశవ్యాప్తంగా రోడ్డుప్రమాదాల్లో 352 మంది మరణించారు. 2022లో 343 మరణాలతో పోలిస్తే 3 శాతం పెరిగాయి. అయితే 2021లో నమోదైన 381 మరణాలతో పోలిస్తే 8 శాతం తగ్గాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!