'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- May 12, 2024
దుబాయ్: స్కూళ్లో నిద్రిస్తున్న మహిళా టీచర్ని అనధికారికంగా ఫోటో తీసి షేర్ చేసినందుకు గాను ఓ స్కూల్ ఉద్యోగికి దుబాయ్ కోర్టు 2,000 దిర్హామ్‌లు జరిమానా విధించింది. ఈ సంఘటన దుబాయ్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. విరామం సమయంలో ఫ్యాకల్టీ లాంజ్‌లో నిద్రిస్తున్న సమయంలో ఇది చోటుచేసుకుంది. పాఠశాలలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న సహోద్యోగి టీచర్‌కు తెలియకుండా మొబైల్ ఫోన్‌ని ఉపయోగించి ఫోటో తీశాడు. అనంతరం ఆ ఫొటోను వాట్సాప్ ద్వారా పాఠశాల యాజమాన్యానికి పంపించారు. ఉపాధ్యాయుడు తన గోప్యతకు భంగం కలిగించారని ఫిర్యాదు చేయడంతో చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఉపాధ్యాయుల గోప్యతను ఉల్లంఘించినందుకు పాఠశాల ఉద్యోగిని దోషిగా దుబాయ్ కోర్టు నిర్ధారించింది. 2,000 దిర్హామ్‌ల జరిమానా విధించింది. ఇతరుల గోప్యతను ఉల్లంఘించకుండా యూఏఈలో కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. ఒకరి గోప్యతకు భంగం కలిగించే ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలు లేదా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం వంటి వాటికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు Dh500,000 వరకు భారీ జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!