ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- May 12, 2024
మస్కట్: ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే, డాక్టర్ మందాకిని ఆమ్టే ఇటీవల ఒమన్‌ను సందర్శించారు. భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన వీరు సాంఘిక సంక్షేమం మరియు సమాజ సేవకు అసాధారణ సేవలను అందించారు. విదర్భ ప్రాంతానికి చెందిన ఈ జంట సలాలా మరియు మస్కట్లకు సందర్శించారు. డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అతని భార్య, డాక్టర్ మందాకిని ఆమ్టేతో కలిసి 2008లో ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ మరియు మధ్యప్రదేశ్‌లోని మాడియా గోండులకు లోక్ బిరాదారి ప్రకల్ప్ ద్వారా చేసిన సహకార ప్రయత్నాలకు ఈ గుర్తింపు లభించింది. ఒమన్‌లో పర్యటనలో ఆమ్టే దంపతులు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఇండియన్ కమ్యూనిటీని ఆలోచింపజేసాయి. భారతీయ రాయబార కార్యాలయంలో భారత రాయబారి అమిత్ నారంగ్‌తో వారు సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!