రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- May 12, 2024
హైదరాబాద్: రూ.4వేల ఆసరా పెన్షన్ పంపిణీ ఎప్పటినుంచి ? అనే దానిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రూ.4 వేల ఆసరా పింఛన్ల పంపిణీ మొదలవుతుందని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. రూ. 2లక్షల రైతు రుణమాఫీ, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడతామన్నారు. శనివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ఈ వివరాలను తెలిపారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ చూస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బండి సంజయ్‌కు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. గత ఐదేళ్లలో లోక్‌సభ నియోజకవర్గానికి బండి సంజయ్ ఏమీ చేయలేదని.. ఆయన రాజకీయాల్లో బిజీగా గడిపారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బండి సంజయ్‌కు కరీంనగర్ ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్‌లు కుట్ర పన్నాయని పొన్నం ఆరోపించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!