భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్‌కు సర్వంసిద్ధం..

- May 12, 2024 , by Maagulf
భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్‌కు సర్వంసిద్ధం..

న్యూ ఢిల్లీ: ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో సోమవారం నాల్గో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో విడతలో ఏపీ(25), తెలంగాణ (17), బిహార్(5), ఝార్ఖండ్(4), మధ్యప్రదేశ్(8), మహారాష్ట్ర(11), ఒడిశా(4), యూపీ(13), ప.బెంగాల్(8), జమ్ముకశ్మీర్(1) లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలాఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.

నాల్గో  విడతలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తున్న కన్నౌజ్ నియోజకవర్గం ఉంది. ఉత్తరప్రదేశ్ లో కన్నౌజ్‌తో పాటు షాజహాన్‌పూర్, ఖేరీ, ధౌరహర, సీతాపూర్, హర్దోయి, మిస్రిఖ్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఎటా, కాన్పూర్, అక్బర్‌పూర్, బహ్రైచ్ నియోజవర్గాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. 4వ విడత పోటీలోఉన్న ప్రముఖుల్లో అఖిలేష్ తో పాటు టీఎంసీ నేతలు మహువా మొయిత్ర (కృష్ణనగర్ – బెంగాల్), శత్రుఘ్న సిన్హా (ఆసన్సోల్ – బెంగాల్), బీజేపీ ముఖ్య నేతలు గిరిరాజ్ సింగ్ (బేగుసరాయి – బీహార్), అర్జున్ ముండా (ఖుంటి – ఝార్ఖండ్) ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com