బాలకృష్ణ సిలికాన్ వ్యాలీలో..
- June 08, 2016
ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తన అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి సిలికాన్ వ్యాలీ చేరుకున్నారు. శాన్ హోజే విమానాశ్రయంలో దిగిన బాలకృష్ణకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి మిల్ పిటాస్‌లో ఆయన బస చేసిన హోటల్ వరకు పెద్ద ఎత్తున కార్ల ప్రదర్శన నిర్వహించారు. బాలకృష్ణ తన భార్య వసుంధరతో కలిసి బుధవారం శాన్ హోజే కన్వెన్షన్ సెంటర్, బయోటెక్ పార్క్ తదితర ప్రాంతాలు సందర్శించారు. శుక్రవారం బాలకృష్ణ 56వ జన్మదిన వేడుకలు బే ఏరియాలోని ఇండియా కమ్యూనిటి సెంటర్ లో నిర్వహిస్తున్నారు. భక్తా భల్లా, గుత్తికొండ ఠాగూర్ తదితరులు బాలయ్య పర్యటనలో పాల్గొన్నారు. అంతకు ముందు సీయాటెల్ లో నిర్వహించిన హైదరాబాద్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి విరాళాల సేకరణ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







