'కబాలి' తెలుగు హక్కులు భారీ ధర
- June 08, 2016
రజనీకాంత్ టైటిల్ రోల్ పోషించిన తాజా చిత్రం 'కబాలి' తెలుగు హక్కులు భారీ ధర పలికాయి. పా. రంజిత్ దర్శకత్వంలో తమిళంలో కలైపుల్ యస్. థాను నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై అంచనాలు అసాధారణ స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. టీజర్ విడుదలయ్యాక 'కబాలి' క్రేజ్ మరింత పెరిగింది. గ్యాంగ్‌స్టర్‌గా రజనీ కనిపించిన తీరు, ఆయన చెప్పిన డైలాగ్స్, ఆయన స్టయిల్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు హక్కుల్ని సొంతం చేసుకోవడానికి పలువురు పేరుపొందిన నిర్మాతలు ప్రయత్నించారు. అనూహ్యంగా షణ్ముఖా ఫిలిమ్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆ హక్కుల్ని పొందింది. వీటి కోసం ఆ సంస్థ అధినేతలు ప్రవీణ్‌కుమార్, కె.పి.చౌదరి ఇప్పటివరకూ ఏ డబ్బింగ్ సినిమాకూ చెల్లించనంత భారీ మొత్తంలో చెల్లించినట్లు సమాచారం. ఈ విషయంలో మునుపటి రజనీ చిత్రం 'రోబో' రికార్డును ఈ సినిమా అధిగమించింది. కాగా 'కబాలి' చిత్రంలో రజనీ భార్యగా రాధికా ఆప్టే నటించారు. ఈ నెల 12న ఆన్‌లైన్ ద్వారా పాటలు విడుదల కానున్నట్లు తెలిసింది. జూలై మొదటి వారంలో అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







