అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- May 13, 2024
దుబాయ్: అల్ షిందాఘా కారిడార్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ 4వ దశ ఇప్పుడు 45 శాతం పూర్తయిందని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ఆదివారం ప్రకటించింది. “అల్ షిందాఘా కారిడార్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం RTAచే అమలు చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటి. దాదాపు పది లక్షల మందికి సేవలందించే ఈ ప్రాజెక్ట్ 2030 నాటికి ప్రయాణ సమయాన్ని 104 నిమిషాల నుండి 16 నిమిషాలకు తగ్గించడానికి సిద్ధంగా ఉంది” అని RTA తెలిపింది.13 కి.మీ పొడవునా 15 కూడళ్లను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్. ఐదు దశలుగా దానిని నిర్మిస్తున్నారు. ఇది దీరా మరియు బర్ దుబాయ్, దుబాయ్ దీవులు, దుబాయ్ వాటర్ ఫ్రంట్, దుబాయ్ మారిటైమ్ సిటీ మరియు మినా రషీద్ వంటి ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు సేవలు అందిస్తుందని RTA డైరెక్టర్ జనరల్ మరియు బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్ మత్తర్ అల్ తాయర్ తెలిపారు. నాలుగో దశలో భాగంగా ఫేజ్ 4 షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్‌తో షేక్ రషీద్ రోడ్ కూడలి నుండి అల్ మినా స్ట్రీట్‌లోని ఫాల్కన్ ఇంటర్‌సెక్షన్ వరకు 4.8 కి.మీ. ఇది అన్ని దిశలలో గంటకు 19,400 వాహనాల సామర్థ్యంతో 3.1 కి.మీ విస్తరించి మూడు వంతెనల నిర్మాణాన్ని చేపడతున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!