ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- May 13, 2024
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌ల వద్ద బార్లు తీరారు. కాగా ఉదయం 9 గంటల సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 9.21 శాతంగా నమోదయిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 9 గంటల వరకు లోక్‌సభకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్ నమోదయినట్టు పేర్కొంది. కుప్పం నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 9.72శాతం, మంగళగిరిలో 5.25శాతం, పిఠాపురంలో 10.02శాతం, పులివెందుల 12.44శాతం పోలింగ్ నమోదయినట్టు అధికారులు వివరించారు.
ఏపీలో జిల్లాల వారీగా చూస్తే 9 గంటల సమయానికి వైఎస్‌ఆర్ జిల్లాలో 12.09శాతం గరిష్ఠంగా నమోదయింది. ఇక అత్యల్పంగా గుంటూరులో 6.17శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. తెలంగాణ జిల్లాలను పరిశీలిస్తే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా 13.22శాతం పోలింగ్ శాతం నమోదయ్యింది. ఇక హైదరాబాద్‌లో అత్యల్పంగా 5.06 శాతం మాత్రమే నమోదయింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!