వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..

- May 13, 2024 , by Maagulf
వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..

వాట్సాప్ ఐఓఎస్ యూజర్లకు అలర్ట్.. 2024 మార్చిలో, ఆండ్రాయిడ్ యూజర్లు ఇతర యూజర్ల ప్రొఫైల్ ఫొటోల స్క్రీన్‌షాట్‌లను తీసుకోకుండా వాట్సాప్ చర్య తీసుకుంటోందని ప్రకటించారు. ఇటీవల యూజర్ల ప్రైవసీపై దృష్టిసారించిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఫిబ్రవరి నుంచి ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు నివేదించింది.

ఇప్పుడు, అదే ఫీచర్ ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. వాట్సాప్ అప్‌డేట్‌లకు సంబంధించి బీటా ఇన్ఫో రిపోర్ట్ ప్రకారం.. మెటా యాజమాన్యంలోని యాప్ త్వరలో ఇతర యూజర్ల ప్రొఫైల్ ఫోటోల స్క్రీన్‌షాట్‌లను తీయకుండా ఐఓఎస్ యూజర్లను నిషేధిస్తుంది.

యూజర్ ప్రైవసీ ఫీచర్‌పై వర్కింగ్:
డబ్ల్యూఏబీటా ఇన్ఫో నివేదిక ప్రకారం.. ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ బీటా ప్రోగ్రామ్ నుంచి లేటెస్ట్ అప్‌డేట్ తీసుకొస్తోంది. (TestFlight) ద్వారా అందుబాటులో ఉన్న వెర్షన్ 24.10.10.70 యాప్ కోసం కొత్త భద్రతా చర్యలపై టెస్టింగ్ చేస్తోంది. ఈ రాబోయే అప్‌డేట్ ఐఓఎస్ యూజర్లు ప్రొఫైల్ ఫోటోల స్క్రీన్‌షాట్‌లకు అనుమతించదు. ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. స్క్రీన్‌షాట్ ప్రకారం.. ఫీచర్ లాంచ్ అయినప్పుడు ఎలా ఉంటుందో నివేదిక వెల్లడించింది.

ఐఓఎస్ యూజర్లు తమ ప్రొఫైల్ ఫోటో స్క్రీన్‌షాట్ తీయడానికి ప్రయత్నించినప్పుడు పరిమితి గురించి యూజర్లకు తెలియజేసే నోటిఫికేషన్ పాప్‌అప్ కావచ్చు. యూజర్ ప్రైవసీ కోసం ప్రొఫైల్ ఫోటోల స్క్రీన్‌షాట్‌లను తీయడం నిలిపివేసినట్టుగా నోటిఫికేషన్ సూచిస్తుంది. ఈ ఫీచర్ ప్రైవసీ దుర్వినియోగాన్ని పూర్తిగా నిరోధించలేదు. కానీ, ప్రొఫైల్ ఫొటోలను అనధికారికంగా ఇతరులకు షేర్ చేయకుండా నివారించగలదు.

ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ గ్రీన్ థీమ్:
ఇటీవల, వాట్సాప్ కూడా ఐఓఎస్ యూజర్ల కోసం థీమ్‌ను గ్రీన్ ఇంటర్‌ఫేస్‌గా మార్చింది. భారత్‌లో ఐఓఎస్ యూజర్లు గత నెలలో వాట్సాప్ కొత్త అప్‌డేట్ అందుకున్నారు. ఇందులో ఇంటర్‌ఫేస్ సాధారణ బ్లూ కలర్ బదులుగా గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ ఎల్లప్పుడూ గ్రీన్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. అదే ఐఫోన్‌లలో బ్లూ కలర్‌గా ఉంటుంది.

స్టేటస్ బార్ నుంచి చాట్-లిస్ట్ విండో వరకు ప్రతిదీ డిజైన్ మార్పు చేసింది. ఈ కొత్త మార్పు ఈ ఏడాది ప్రారంభంలో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇటీవల ఎక్కువ మంది యూజర్లకు అప్‌డేట్ అయింది. ఐకాన్‌లతో పాటు, యాప్‌లో షేర్ చేసిన లింక్‌లు కూడా సాధారణ బ్లూ కలర్ బదులుగా గ్రీన్ కలర్ కలిగి ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com