ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- May 14, 2024
ముంబై: దేశీయ ఆర్థిక రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో సోమవారం (మే 13న) అత్యంత బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం అల్లకల్లోలం సృష్టించింది. నగరంలోని ఘట్కోపర్ ప్రాంతంలో పెట్రోల్ పంపుపై ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా భారీగా సంఖ్యలో వాహనదారులకు గాయాలయ్యాయి. పంత్‌నగర్‌లోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే వెంబడి పోలీస్ గ్రౌండ్ పెట్రోల్ పంపు వద్ద ఈ ఘటన జరిగింది. అయితే, తీవ్రంగా గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. మంగళవారం ఉదయం వరకు మృతుల సంఖ్య 14కు చేరింది. మరోవైపు హోర్డింగ్ కింద చిక్కుకున్న 74 మందిని సహాయక సిబ్బంది ప్రాణాలతో రక్షించారు. తీవ్రగాయాలైన పలువురు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదం జరిగినప్పుడు పెట్రోల్ పంపుదగ్గర 100 మందికిపైగా ఉన్నారు. హోర్డింగ్ పడిపోవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పడిపోయిన భారీ హోర్డింగ్ కింద చిక్కుకున్న వారిని ప్రాణాలతో రక్షించారు. తెల్లవారు జామున వరకు హోర్డింగ్ లో చిక్కుకున్న మొత్తం 86 మందిని రక్షించి చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న 74 మందిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గాయపడ్డవారిలో 31 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.
ఘటన తరువాత బిల్ బోర్డ్ తయారీ ఏజెన్సీ, దాని యాజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో హోర్డింగ్ యజమాని భవేష్ బిండే, ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తరువాత బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తమ అనుమతి లేకుండా బిల్ బోర్డ్ ను తయారు చేశారంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!