మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- May 14, 2024
వారణాసి: మూడోసారి మోడీ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేసారు టీడీపీ అధినేత చంద్రబాబు. కొద్దీ సేపటి క్రితం మోడీ వారణాసి లో ప్రధాని మోడీ నామినేషన్ వేశారు. ఇక్కడి నుంచి ఇప్పటివరకు రెండుసార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, పార్టీ సినియర్ నేతలు, బీజేపీ పాలిత, మిత్రపక్షాల ముఖ్యమంత్రులతోపాటు ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం మంగళవారం ఉదయం వారణాసి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
“ఇది ఒక చారిత్రాత్మక సందర్భం. ఇది ఒక పవిత్ర ప్రదేశం. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. గత 10 ఏళ్లలో ఆయన చాలా బాగా పనిచేశారు. దేశానికి ఆయన అవసరం. రాబోయే రోజుల్లో ప్రపంచ వేదికపై భారతదేశం ప్రధాన పాత్ర పోషించబోతోంది. ఎన్డీయే 400 సీట్లకు పైగా సాధించడం ఖాయం” అని చంద్రబాబు అన్నారు. అలాగే బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ మృతిపై ఆయన స్పందిస్తూ సంతాపం తెలియజేశారు. బీజేపీ సీనియర్ నేత అకాల మరణం బాధాకరమైన సంఘటన అని టీడీపీ అధినేత పేర్కొన్నారు. కాగా, మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ సోమవారం రాత్రే వారణాసి చేరుకున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!