ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- May 15, 2024
దోహా, ఖతార్: “ఏ ఛేంజింగ్ వరల్డ్-ట్రావెర్సింగ్ ది అన్నౌన్ ” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ నాల్గవ ఎడిషన్‌ను అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఫెయిర్మాంట్లోని కతారా టవర్స్‌లో ప్రారంభించారు. ఫోరమ్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ప్రసంగించారు. హిస్ హైనెస్ అమీర్, ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి హిస్ ఎక్సెలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో ప్రారంభ సెషన్‌ను, పోలాండ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ ఆండ్రెజ్ దుడాతో మరొక డైలాగ్ సెషన్‌ను కూడా అమీర్ వీక్షించారు. మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంతో మరొక డిస్కషన్ సెషన్ జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో ఖతార్, విదేశాల ఉన్నత మంత్రులు పాల్గొన్నారు. గుర్తింపు పొందిన దౌత్య మిషన్ల అధిపతులు, సీనియర్ అధికారులు మరియు పార్లమెంటేరియన్లు, మేధావులు, ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..