‘కన్నప్ప’ రేంజ్ బానే పెంచారుగా.!

- May 15, 2024 , by Maagulf
‘కన్నప్ప’ రేంజ్ బానే పెంచారుగా.!

మంచు ఫ్యామిలీ ప్రెస్టీజియస్ మూవీగా రూపొందుతోన్న ‘కన్నప్ప’ సినిమాని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లారు. ఈ సినిమా స్టార్టింగ్ నుంచీ ఏదో  ఒక ఇంట్రెస్టింగ్ అప్టేట్ ఇస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆ దిశగా కాస్టింగ్‌లో అంచనాలకు మించి ఆర్టిస్టుల్ని తీసుకొచ్చారు. వివిధ భాషల నుంచి పలువురు స్టార్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రబాస్ మొదలుకొని, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ వరకూ తమిళ, మలయాళ పరిశ్రమల నుంచి కూడా పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా టీజర్‌ని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. టీజర్‌లో ఏం కట్ చేస్తారనేది పక్కన పెడితే టీజర్ రిలీజ్ ప్లాట్‌పామ్ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది.

హాలీవుడ్ సినిమా ప్రమోషన్లు మాత్రమే జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివ్ద‌లో ‘కన్నప్ప’ సినిమా టీజర్ రిలీజ్‌ని ప్లాన్ చేశారు. ఈ నెల 20న ఆ టీజర్ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇది నిజంగానే చాలా గ్రేట్. సో, ‘కన్నప్ప’ రేంజ్ ఇప్పటికయితే ఇలా పెంచేశారు. మరి, టీజర్ వచ్చాకా ఆ రేంజ్ అలాగే వుంటుందా.? లేదా.? అనేది చూడాలిక.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com