అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!

- May 16, 2024 , by Maagulf
అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!

మనామా: అరబ్ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు బహ్రెయిన్‌లో నిన్న సమావేశమై రాబోయే అరబ్ సమ్మిట్‌కు సిద్ధమయ్యారు. బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అధ్యక్షతన జరగనున్న ఈ సమ్మిట్ గురువారం ప్రారంభం కానుంది. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ ప్రసంగంతో సమావేశం ప్రారంభమైంది. గాజాలో ఇటీవల జరిగిన హింసాకాండపై మంత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దుల ఆధారంగా స్వతంత్ర పాలస్తీనా రాష్ట్రంతో రెండు-రాష్ట్రాల పరిష్కారం అవుతుందన్నారు. ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవడంలో అంతర్జాతీయ సంస్థలు పూర్తిగా విఫలం అయినట్లు పేర్కొన్నారు.  బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించారు.  ప్రస్తుత అరబ్ సమ్మిట్ అత్యంత సున్నితమైన రాజకీయ,  భద్రతా పరిస్థితులు, ఆర్థిక సవాళ్లు, మానవతా విషాదాలు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సంఘర్షణల మధ్య నిర్వహించబడుతుందని విదేశాంగ మంత్రి చెప్పారు. అరబ్ దేశాలు ఐక్యంగా మరియు సంఘీభావంతో ఈ ప్రాంతాన్ని రక్షించడానికి కట్టుబడి ఉండాలని కోరారు.  పాలస్తీనా సమస్యను పరిష్కరించేందుకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సును నిర్వహించాలని తీర్మానించారు. సూడాన్, లిబియా, యెమెన్ మరియు సిరియాలోని పరిస్థితులతో సహా అరబ్ ప్రపంచంలోని ఇతర ముఖ్యమైన సమస్యలను కూడా సమావేశంలో ప్రస్తావించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com