‘వెతుకు వెతుకు..’ అంటోన్న ‘సత్యభామ’.!

- May 16, 2024 , by Maagulf
‘వెతుకు వెతుకు..’ అంటోన్న ‘సత్యభామ’.!

చందమామ కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. అదేనండీ, కాజల్ అగర్వాల్ నటిస్తున్న తాజా చిత్రం పేరే ‘సత్య భామ’. ఈ సినిమా మొదటి టీజర్ నుంచీ అంచనాలు పెంచేస్తూనే వచ్చింది.

స్టార్టింగ్ గ్లింప్స్‌లోనే కాజల్ అగర్వాల్‌ని ప్రొజెక్ట్ చేసిన విధానం అభిమానుల్ని ఆకట్టుకుంది. అదే టెంపో మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు లిరికల్ సాంగ్స్.. రెండు టీజర్లు రిలీజ్ అయ్యాయ్.

అన్నీ ఒకదానికొకటి అద్భుతం అనేలానే వున్నాయ్. డిఫరెంట్‌గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయ్. తాజాగా ‘వెతుకు వెతుకు..’ అంటూ సాగే ఓ కాన్సెప్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో కాజల్ అగర్వాల్ ఓ వైపు హాట్ లుక్స్ అండ్ స్టెప్స్‌తో ఆకట్టుకుంటూనే అదరగొడుతోంది.

అలాగే, సాంగ్ కొరియోగ్రఫీ కూడా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి తర్వాత కాజల్ నుంచి వస్తున్న ఈ హీరోయిన్ సెంట్రిక్ మూవీ కాజల్ కెరీర్‌లో ఓ మైలు రాయి కాబోతోందేమో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com