అరికాళ్ల మంటలు కారణాలు.!

- May 16, 2024 , by Maagulf
అరికాళ్ల మంటలు కారణాలు.!

చాలా మందిలో అరికాళ్ల మంటలు వేధిస్తుంటాయ్. దీనికి అనేక కారణాలు. వయసుతో సంబంధం లేకుండా ఈ అరికాలి మంటల సమస్యతో బాధపడుతుంటారు కొందరు.
వీటికి కారణాలేంటీ.? వాటిని తగ్గించుకోవడమెలా.? ఈ అరికాలి మంటల్ని వైద్య పరంగా న్యూరోపతి అని పిలుస్తారు. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది.? ఇప్పుడు తెలుసుకుందాం.

అరికాలిలోని నరాలు దెబ్బ తినడంతో నరాల మీద వుండే పొరల మీద ఒత్తిడి పెరిగి మంట పుడుతుంది. తద్వారా అరికాలిలో మంటలు ఏర్పడతాయ్.

సహజంగా డయాబెటిస్ వున్న వారిలో హార్మోన్స్ ప్రాబ్లెమ్స్ వల్ల ఈ అరికాలి మంటలు ఏర్పడతాయ్. కొందరికి మానసిక సమస్యల వల్ల కూడా ఈ అరికాలి మంటలొస్తుంటాయ్.
ఆడవారికి పీరియడ్స్ టైమ్‌లో ఈ సమస్యలు వేధిస్తుంటాయ్. మరికొందరు ఆడవాళ్లలో మెనోపాజ్ టైమ్‌లో స్టార్ట్ అవుతాయ్. కీమోథెరపీ, మద్యపానం, ఎయిడ్స్, మూత్ర పిండాల సమస్యలతో బాధపడేవారిలోనూ అరికాలి మంటలు చూస్తుంటాం.

పాదాల్లో పగుళ్లు కూడా వీటికి ఓ కారణం. విటమిన్ బి 12 లోపం కారణంగా పాదాల మంటలొస్తాయని నిపుణులు చెబుతున్నారు. సో, విటమిన్ బి 12 ఎక్కువగా వుండే ఆహార పదార్ధాల్ని తీసుకోవడం వల్ల కొంతవరకూ ఈ సమస్యను అధిగమించొచ్చు.

అయితే, పాదాల మంటల్ని లైట్‌గా వదిలేయకూడదు. ఏ కారణంగా ఆ సమస్య వస్తుందనేది గుర్తించి తగు వైద్య చికిత్స చేయించుకోవడం ఉత్తమం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయా వ్యాధులకు చికిత్స అందించడం ద్వారా మాత్రమే పాదాల మంటల్ని పూర్తిగా నివారించడం జరుగుతుంది.

అలాగే ఇంటి చిట్కాల విషయానికి వస్తే, అల్లం రసం, ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెతో కాళ్లను మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కాస్త ఉపశమనం వుంటుంది. అలాగే గోరువెచ్చని నీళ్లలో పాదాల్ని వుంచడం వల్ల కూడా కాస్త రిలీప్ వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com