నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- May 17, 2024
అమరావతి: ఏపీ సీఎం జగన్ ఈ రాత్రి లండన్ కు బయల్దేరుతున్నారు. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల బిజీలో ఉన్న జగన్ విశ్రాంతి కోసం తన భార్య భారతితో కలిసి విదేశాలకు వెళ్తున్నారు. ఈ రాత్రి 11 గంటలకు ఆయన విజయవాడ నుంచి లండన్ కు పయనమవుతున్నారు. జగన్ కుమార్తెలు లండన్ లో ఉంటున్నారు. లండన్ తో పాటు స్వాట్జర్లాంట్ లో కూడా ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 31న ఆయన విదేశాల నుంచి తిరిగొస్తారు.
విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని కోర్టును కోరారు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనే బెయిల్ కండిషన్ నేపథ్యంలో… ఆ షరతులను సడలించాలని కోర్టును జగన్ కోరారు. లండన్, ఫ్రాన్స్, స్వట్జర్లాండ్ లో పర్యటించేందుకు అనుమతిని ఇవ్వాలని విన్నవించారు. జగన్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు… విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!