ఆన్‌లైన్‌లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక

- May 17, 2024 , by Maagulf
ఆన్‌లైన్‌లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక

యూఏఈ: మీరు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న కారు లేదా బ్యాగ్ కోసం కొనుగోలుదారుడు సంప్రదించాడా? నకిలీ బ్యాంకు రశీదులు పంపే మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ అమ్మకందారులను లక్ష్యంగా చేసుకున్న స్కామ్ గురించి అబుదాబి పోలీసులు శుక్రవారం నివాసితులను అప్రమత్తం చేశారు. ఈ బూటకపు కొనుగోలుదారులు సాధారణంగా 'రసీదులను' పంపుతారని, వారు ఇప్పటికే డబ్బును పంపినట్లు చెబుతారని,  కానీ చెల్లింపు చేయరని తేలిందని క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ డైరెక్టర్ కల్నల్ మస్లిం ముహమ్మద్ అల్ అమరీ తెలిపారు.  డబ్బు అందే వరకు వస్తువులను ఇవ్వవద్దని కల్నల్ అల్ అమరీ విక్రేతలను కోరారు.  ఇలాంటి మోసాలకు పాల్పడిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అబుదాబిలో ఉన్నవారు టోల్-ఫ్రీ హాట్‌లైన్ 8002626 (AMAN2626) లేదా SMS (2828) ద్వారా లేదా [email protected] ae కి ఇ-మెయిల్ పంపడం ద్వారా పోలీసులను సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారులు పోలీసుల అధికారిక యాప్‌ను కూడా ఉపయోగించవచ్చని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com