ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ

- May 17, 2024 , by Maagulf
ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ

దోహా: ఖతార్ మ్యూజియంలు (QM) మే 17 నుండి 18 వరకు ఉచిత ప్రవేశాన్ని కల్పించింది. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఆ ప్రత్యేక అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతార్, ఇస్లామిక్ ఆర్ట్ మ్యూజియం, మథాఫ్: అరబ్ మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్, 3-2-1 కతార్ ఒలింపిక్ మరియు స్పోర్ట్స్ మ్యూజియం , ఖతార్‌లోని నివాసితులు మరియు సందర్శకులు ఉచితంగా సందర్శించవచ్చని ఖతార్ మ్యూజియమ్స్ సీఈఓ మహ్మద్ సాద్ అల్ రుమైహి తెలిపారు. ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనేది అంతర్జాతీయ మ్యూజియంల కౌన్సిల్ సమన్వయంతో ఏటా మే 18 నిర్వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com