ఫైర్ ఫోర్స్ 'ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్' క్యాంపెయిన్

- May 20, 2024 , by Maagulf
ఫైర్ ఫోర్స్ \'ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్\' క్యాంపెయిన్

కువైట్: వేసవి సెలవులకు ముందు అగ్ని ప్రమాదాలను నివారించడానికి భద్రతా విధానాలపై అవగాహన కల్పించడానికి  జనరల్ ఫైర్ ఫోర్స్ "ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్" పేరుతో సమగ్ర అవగాహన ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రమాదాల నివారణ, ఆస్తి మరియు ప్రాణ రక్షణ, సమాజ భద్రతలో జాతీయ సామాజిక బాధ్యతను గుర్తుచేయడానికి ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.  వివిధ ఎలక్ట్రానిక్ ఛానెల్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వయస్సుతో సంబంధం లేకుండా పౌరులు, నివాసితులందరికీ విస్తృతమైన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.  అగ్ని ప్రమాదాలు, నివారణ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అగ్నిమాపక దళం వ్యూహాత్మక ప్రణాళికలో ఈ ప్రచారం భాగమని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com