ట్రాఫిక్‌ సేఫ్టీ కాంపిటీషన్‌ మెయిన్‌ ప్యానెల్‌ సమావేశం

- June 09, 2016 , by Maagulf
ట్రాఫిక్‌ సేఫ్టీ కాంపిటీషన్‌ మెయిన్‌ ప్యానెల్‌ సమావేశం

ఈ ఏడాదికి సంబంధించి ట్రాఫిక్‌ సేఫ్టీ కంపిటీషన్‌ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ మరియు కస్టమ్స్‌ ఫర్‌ ఆపరేషన్స్‌ మేజర్‌ జనరల్‌ హమాద్‌ బిన్‌ సులైమాన్‌ అల్‌ హత్‌మి నాయకత్వంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ట్రాఫిక్‌ సేఫ్టీ అవార్డుల కోసం నామినేట్‌ చేయబడ్డ పలు ప్రాజెక్టుల గురించి సుదీర్ఘమైన చర్చ జరిగిందని అధికారులు తెలిపారు. 2017 ట్రాఫిక్‌ కాంపిటీషన్‌ - మీడియా ప్లాన్‌ గురించి కూడా చర్చించారు. ట్రాఫిక్‌ ప్రమాదాల్ని నివారించడం ప్రధాన ఎజెండాగా పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో ప్రసంగించారు. ప్రైవేటు సంస్థలు, అలాగే ఎన్‌జిఓలు కూడా ట్రాఫిక్‌ సేఫ్టీపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలనీ, వాటికి తగినంత సహాయం ప్రభుత్వం అందజేస్తుందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com