‘మిరాయ్’ నుంచి మోస్ట్ డేంజరస్ ఫోర్స్ ఎంట్రీ.!

- May 20, 2024 , by Maagulf
‘మిరాయ్’ నుంచి మోస్ట్ డేంజరస్ ఫోర్స్ ఎంట్రీ.!

సూపర్ హీరో తేజ సజ్జా నుంచి వస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. ఈ సినిమాలో సూపర్ యోధగా తేజ సజ్జా కనిపించనున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి తేజ సజ్జా క్యారెక్టర్ పరిచయం చేస్తూ వచ్చిన గ్లింప్స్ సినిమాని భారీ స్కేల్‌లో చూపించింది.

ఇక, తాజాగా ఈ సినిమా నుంచి విలన్‌ని పరిచయం చేసిన విధానం సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా చేశాయ్. ఈ సినిమాలో విలన్‌గా మంచు మనోజ్ నటిస్తున్నాడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘మిరాయ్’ నుంచి ‘బ్లాక్ స్వార్డ్’ అంటూ ఆయన క్యారెక్టర్ పరిచయం చేశారు.

‘వరల్డ్స్ మోస్ట్ డేంజర్ ఫోర్స్..’ అంటూ మనోజ్‌పై డిజైన్ చేసిన భీభత్సమైన పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయేలా వుంది. కొన్ని సెకన్ల పాటే వున్న ఈ వీడియో గ్లింప్స్‌లో మంచు మనోజ్ సెటిల్డ్ పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు.

విలన్ రోల్ ఎంత పవర్‌ఫుల్‌గా వుంటే, హీరో రోల్ అంత బాగా ఎలివేట్ అవుతుంది. సో, ఈ సినిమాని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని అంత ఆషామాషీగా తెరకెక్కించేటట్లు లేడు. రెండు ప్రోమోస్‌తోనే ఈ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాడు. చూడాలి మరి, ముందు ముందు ‘మిరాయ్’ ఏ రేంజ్‌లో టర్న్ తీసుకోనుందో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com