‘దేవర’.! ఎలివేషన్ ఎవరికిచ్చారయ్యా.!
- May 20, 2024
ఎన్టీయార్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు ‘దేవర’ టీమ్. ఈ సినిమా నుంచి సాంగ్ కానీ, టీజర్ ప్రోమో కానీ వదులుతారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే సాంగ్ వీడియోని రిలీజ్ చేశారు.
మరి, ఈ వీడియో పట్ల ఎన్టీయార్ అభిమానులు సంతృప్తికరంగా వున్నారా.? అంటే మిశ్రమ స్పందన వినిపిస్తోంది. లిరికల్ సాంగ్‌తో పాటూ వీడియో ప్రోమో కూడా వచ్చింది. అయితే, ఈ సాంగ్‌లో ఎన్టీయార్‌కిచ్చిన బిల్డప్ కన్నా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌కిచ్చిన బిల్డప్పే ఎక్కువయిపోయింది.
వీడియోలో ఎన్టీయార్ ఎక్కడున్నాడు.? అని వెతుక్కోవల్సి వచ్చింది.? అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయ్. అయితే, ఓ వర్గం ఎన్టీయార్ అభిమానులు ఎన్టీయార్ పక్కా మాస్ లుక్స్‌కి షేక్ అవుతున్నారు. ఇప్పుడు నమ్మకమొచ్చింది ‘దేవర’పై అంటున్నారు.
అయితే, ప్రస్తుతం ఎన్టీయార్ రేంజ్‌కి ఇది చాలదు.. ఇంకా కావాలి అంటున్నారు. కొందరైతే లిరిక్స్ అస్సలు అర్ధమే కావడం లేదని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇంకొందరు లిరిక్స్ చాలా బావున్నాయంటున్నారు. ఇలా పలు రకాల అభిప్రాయాలున్నప్పటికీ మొత్తానికి ‘దేవర’ ఫస్ట్ సింగిల్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







