‘గేమ్ ఛేంజర్’ ఖేల్ ఖతమ్ అయినట్లేనా.?
- May 20, 2024
శంకర్ సినిమాలంటే చాలా గ్రాండియర్ లుక్‌లో వుంటాయ్. భారీ అంచనాలు కూడా వుంటాయ్. ఇదంతా తెలిసిన సంగతే. కానీ, ఆయన సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పడమే చాలా కష్టం.
అదే పరిస్థితి ఇప్పుడు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కీ వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి సినిమా రాలేదు. అభిమానులు ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు.
ఆ సినిమాతో క్రేజ్ ప్రపంచం చుట్టేసినా వరుస సినిమాలు లేకపోవడం అభిమానులను నిరాశపరిచే అంశమే. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇంకా ఓ కొలిక్కి రాలేదింతవరకూ.
ఇదిగో అదిగో అంటున్నారు కానీ, ఆ సినిమా స్టేటస్ ఏంటో కూడా తెలీదు. ఈ సినిమా సెట్స్‌పై వుండగానే ఎప్పుడో వదిలేసిన ‘ఇండియన్ 2’ సినిమాని పట్టాలెక్కించాడు శంకర్. దాంతో ‘గేమ్ ఛేంజర్’ని పక్కన పెట్టేశాడు.
పరిస్థితులు చూస్తుంటే, ఇప్పట్లో ‘గేమ్ ఛేంజర్’ వచ్చే అవకాశాలే లేవంటూ ప్రచారం జరుగుతోంది. దీన్ని పక్కన పెట్టేసి, బుచ్చిబాబు సన సినిమాని వీలైనంత తొందరగా పూర్తి చేసి ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపడం మంచిదని మెగా అభిమానులు సూచిస్తున్నారు. చూడాలి మరి చరణ్ ఏం చేస్తాడో.!
తాజా వార్తలు
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్







