పెరిగిన పసిడి ధర
- June 09, 2016
బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. రూ.10 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,170కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, దేశీయంగా నగల వ్యాపారులు కొనుగోళ్లకు దిగడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1.55శాతం పెరిగి 1,262.50 డాలర్లకు చేరింది.
వెండి సైతం బంగారం దారిలోనే పయనించింది. మళ్లీ రూ.40వేల మార్కును చేరుకుంది. ఈ ఒక్కరోజే రూ.1000 పెరగడంతో కేజీ వెండి ధర రూ.40,500కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లుకు మొగ్గు చూపడంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 17.01 యూఎస్ డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







