కల్కి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటీ సంస్థ..
- May 21, 2024
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో కల్కి 2898AD ఒకటి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా నటిస్తుండగా.. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ గా కనిపించబోతున్నాడు.
సినీ ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమాల్లో కల్కి ఒకటి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్ లో వస్తుందా.. ? అని ఎదురుచూసేవాళ్ళు కొంతమంది అయితే.. సినిమా థియేటర్ నుంచి ఓటిటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. ? అని వెయిట్ చేస్తున్నవారు మరికొంతమంది. ఇక అలాంటి వారికి గుడ్ న్యూస్.
ఎట్టకేలకు కల్కి డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. హిందీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేయగా.. మిగతా అన్ని భాషలను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ డిజిటల్ ఎంట్రీలపై మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. కల్కి కోసం అమెజాన్ ప్రైమ్ బాగానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం హిందీ రైట్స్ కు నెట్ ఫ్లిక్స్ రూ. 175 కోట్లు ఖర్చు చేయగా.. అమెజాన్ అన్ని సౌత్ భాషలు కలిసి దాదాపు రూ.200 కోట్లు పెట్టినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్ తన్నుకుపోతుంది.
ఈసారి పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న సినిమాను అమెజాన్ అందుకోవడంతో మంచి లక్కీ ఛాన్స్ కొట్టిందని అభిమానులు అంటున్నారు. ఇకపోతే కల్కి జూన్ 27 న రిలీజ్ కానుంది. అన్ని సినిమాల లానే దాదాపు నాలుగువారాల తరువాత ఓటిటీలోకి వస్తుంది అని అనుకుంటే పొరపాటే. కల్కి కొద్దిగా టైమ్ తీసుకొని వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు అందుకుంటాడో చూడాలి.
తాజా వార్తలు
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్







