బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. సినీ, రాజకీయ ప్రముఖులతో టచ్లో ప్రధాన నిందితుడు
- May 22, 2024
బెంగళూరు రేవ్ పార్టీ సినీ ఇండస్ట్రీనేకాదు.. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. తాజాగా విజయవాడలో రేవ్ పార్టీ మూలాలు బయటపడ్డాయి. రేవ్ పార్టీకి ప్రధాన నిందితుడు వాసు అలియాస్ లంకపల్లి వాసు విజయవాడ వాసి. కొత్తపేటలోని ఆంజనేయవావకు చందిన వాసు.. హైదరాబాద్, బెంగళూరు నుంచి క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహిస్తుంటాడు. విజయవాడలోనూ అతిపెద్ద బుకీల నెట్ వర్క్ ను విస్తరించాడు వాసు. బర్త్ డే సందర్భంగా వాసు స్వయంగా బెంగళూరులోని ఫామ్ హౌస్ పార్టీని ఏర్పాటు చేయగా.. విజయవాడకు చెందిన నలుగురు ప్రధాన బుకీలు మిగిలిన ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోనే మకాం వేసిన వాసు.. అక్కడి నుంచే మొత్తం వ్యవహారం నడిపించినట్లుగా తెలుస్తోంది.
బెంగళూరు రేవ్ పార్టీ పై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. పార్టీ నిర్వాహకులు లంక పల్లి వాసు విజయవాడ వాసిగా గుర్తించిన పోలీసులు.. అతనికి చాలా మంది సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలతో పరిచయం ఉందని గుర్తించారు. ప్రతి సంవత్సరం వాసు పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. క్రికెట్ బెట్టింగులను సైతం వాసు నిర్వహించేవాడు. ఐపీఎల్ సీజన్ లో కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందని, దీంతో సెలబ్రెటీలతో, రాజకీయ నేతలతో పార్టీకి వాసు ప్లాన్ చేసినట్లు తెలిసింది. గత ఆదివారం బెంగళూరు శివారులోని ఫామ్ హౌస్ లో వాసు రేవ్ పార్టీని ఏర్పాటు చేశాడు. పోలీసులు దాడులు చేసి రేవ్ పార్టీ లో డ్రగ్స్ సీజ్ చేశారు. రేవ్ పార్టీ కి వచ్చిన వారి వద్ద నుండి బ్లెడ్ షాంపుల్స్ తీసుకున్నారు. వాటిని FSL కు పంపించారు. డ్రగ్స్ పెడ్లర్స్ తో వాసుకున్న సంబంధాల పై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు సినీనటి హేమ కూడా ఈ రేవ్ పార్టీ లో ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ, తాను ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదంటూ హేమ బుకాయిస్తున్నారు. ఈ మేరకు తాను ఇంట్లోనే ఉన్నట్లు పలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. మరోవైపు బ్లెడ్ షాంపుల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలితే వారిపై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు







